హైదరాబాద్, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) : హైదరాబాద్ నగరానికి నీటిని సరఫరా చేసే గండిపేట కాండ్యూట్ లో సబ్జా కాలనీ, టోలిచౌకి, మణికొండ ప్రాంతాల వద్ద ఏర్పడిన భారీ లీకేజీలను అరికట్టేందుకు జలమండలి మరమ్మతు పనులు చేపట్టనుంది. ఈ పనులు ఈ నెల 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల నుంచి 4వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు మొత్తం 36 గంటల పాటు చేపడతారు. ఈ పనుల కారణంగా నగరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా అంతరాయం ఏర్పడుతుంది.
తాగునీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు :
గోషామహల్, కార్వాన్ సర్కిళ్లు ( డివిజన్-13 ) :
రెడ్‌హిల్స్, నాంపల్లి, మల్లేపల్లి, సీతారాంబాగ్, గోడేకీ ఖబర్, హిందీనగర్, అసెంబ్లీ, సెక్రటేరియట్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఆదర్శ్‌నగర్, నాంపల్లి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రాంతం, గన్‌ఫౌండ్రీ.
గోల్కొండ జోన్ ( డివిజన్-14 ) :
చింతల్ బస్తీ, విజయనగర్ కాలనీ, ఓల్డ్ మల్లేపల్లి, ఆసిఫ్‌నగర్, అహ్మద్‌నగర్ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోనుంది.
కవాడిగూడ సర్కిల్ ( డివిజన్-17 ) :
కవాడిగూడ, గాంధీనగర్ వార్డుల పరిధిలోని దోమలగూడ తదితర ప్రాంతాల్లో ప్రభావం పడనుంది.
జూబ్లీహిల్స్ సర్కిల్ ( డివిజన్-15 ) :
బంజారాహిల్స్ వార్డు పరిధిలోని ప్రాంతాలున్నాయి.
కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి అధికారులు కోరుతున్నారు.






