Saturday, October 31, 2026
No menu items!
HomeGREATER HYDERABADరైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్...

రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి – బీసీ పీపుల్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్

📰 Generate e-Paper Clip

ఎల్‌బి న‌గ‌ర్‌, అక్టోబర్ 30, ( అద్దం న్యూస్ ) :     తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో ప్రభావంతో వర్షాలు కురవక ప్రాజెక్టులో నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీసీ పీపుల్స్ ఫెడరేషన్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొంగు వెంకటేష్ గౌడ్ అన్నారు. శుక్ర‌వారం ఎల్‌బి న‌గ‌ర్‌లోని బిసి భ‌వ‌న్‌లో ఆయ‌న మాట్లాడుతూ…రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల మూలంగా అనేక మంది రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని పేర్కొన్నారు. కొంత మంది రైతులు బోర్ల మీద ఆధారపడి సాగు చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వము పంటలు సాగు చేయొద్దని పదేపదే చెప్తున్నప్పటికీ రైతులు అయోమయానికి గురి అవుతున్నారన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నప్పటికీ పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడితే మా కుటుంబాలను ఎలా పోషించుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

రైతులు వారి పిల్లల ఖర్చులు కుటుంబ అవసరాలు వైద్య ఖర్చులు పిల్లల చదువులు కుటుంబ పోషణ భారంగా మారుతుందని రైతులు ఆందోళన గురవుతున్నార‌న్నారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వము తక్షణమే రైతుల పరిస్థితిని అర్థం చేసుకొని తగ్గిన చర్యలు చేపట్టాలని వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతులకు ఆర్థిక సాయం అందించి రైతులను ఆదుకోవాలని వ్యవసాయం శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కి విజ్ఞప్తి చేశారు. రైతులకు సరైన భరోసా కల్పించకపోతే తీవ్ర నిరాశకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం నాయకులు డాక్టర్ అవ్వారు వేణు, బిసిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చెన్న శ్రీరాములు, బిసిఎఫ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సీతా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page