సికింద్రాబాద్, ( అద్దం న్యూస్ ) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 151వ జయంతిని పురస్కరించుకుని శనివారం సికింద్రాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి నిలయంలో జాతీయ ఐక్యతా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో NISA CISF ఇన్‌స్పెక్టర్ జనరల్ హర్‌ప్రీత్ కౌర్, మోటివేషనల్ స్పీకర్, సివిల్ సర్వీసెస్ మెంటర్ బాల లత, డాక్టర్ రజినీ ప్రియ, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ… భారతదేశపు మొదటి ఉప ప్రధానిగా, హోం మంత్రిగా పటేల్ రాచరిక రాష్ట్రాలను ఏకీకృతం చేయడంలో, ఐక్య భారతదేశపు పునాదులను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఐక్యత, సామరస్యం, సంఘీభావాన్ని నిలబెట్టడానికి ఆయన దార్శనికత మనకు స్ఫూర్తినిస్తూనే ఉందన్నారు.

![]()






