Sunday, November 1, 2026
No menu items!
HomeGREATER HYDERABADఉద్య‌మ‌కారుల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు – తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ...

ఉద్య‌మ‌కారుల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సుముఖంగా ఉన్నారు – తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు, ప్రొఫెస‌ర్ కోదండరాం

📰 Generate e-Paper Clip

తార్నాక‌, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) :      తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమం ప్రక్రియ వేగవంతం చేయాల‌ని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు ప్రొఫెస‌ర్ కోదండరాం, మోతే శోభన్ రెడ్డిలను ఉద్య‌మ‌కారులు కోరారు. శ‌నివారం తార్నాక‌లోని ప్రొఫెస‌ర్ కోదండ‌రాం ను ఆయ‌న ఇంటి వ‌ద్ద టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపూల్‌ రామ్ రెడ్డి తో పాటు ప్రధాన కార్యదర్శి కల్లపు చంద్రన్న ప్రసాద్, అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, 1969 ఉద్యమకారులు రంగారెడ్డి, శంకర్‌రావు, అంతారి హరి ప్రసాద్ గౌడ్, పాండు గౌడ్, దుండిగాల అంజయ్య, కన్నం యాదగిరి, హరినాథ్ బాబు, రాజు, భాస్కర్, నరసయ్య, పుట్ట రంజిత్,,ఎన్.శంకర్, బి.వేణుగోపాల్, కర్ణయ్య, బి.రాజు, రాము, ఏ.సంపత్, మహిళా ఉద్యమకారులు బాకారం లావణ్య, సుజీ, పుష్ప, అంజలి కుమారి, రాణి, డి.లలిత, టి.పద్మ, ఎ.కవిత, లలితమ్మ, ఇందిరా తదితరులు క‌లిశారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని విధాలుగా నష్టపోయి కనీసం ప్రభుత్వ గుర్తింపు సంక్షేమం కోసం ఎదిరి చూస్తున్న ఉద్యమకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఇప్పటికే సీనియర్ ఉద్యమకారులు కొంతమంది మరణించడం కూడా సంభవించిందని, ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ నత్తనడకన నడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను ప్రారంభించి, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ద్వారా వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

దాంతోపాటు నేటికీ ఉద్యమకారులపై మిగిలిన ఉద్యమ కేసులను, గత ప్రభుత్వం నమోదు చేసిన కేసులతో సహా ఎత్తివేయాలని, తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర వారి త్యాగం వెలకట్టలేనిదని, అయితే నేటికీ విద్యార్థులు చదువులకు, ఉద్యోగాలకు దూరమై నిరుద్యోగులుగా మిగిలారని, వారికి సూపర్ న్యుమరి కోటాలో లేదా స్పెషల్ నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని టియు జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ప్రపూల్‌ రామ్ రెడ్డి తో పాటు ప్రధాన కార్యదర్శి కల్లపు చంద్రన్న ప్రసాద్, అధికార ప్రతినిధి కంచర్ల బద్రి, 1969 ఉద్యమకారులు రంగారెడ్డి కోరారు. అనంత‌రం ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమకారులతో మాట్లాడుతూ… ఉద్యమకారుల అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని, ఒక వారం పది రోజుల్లో త్వరలోనే ఒక వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభిస్తామని, డిసెంబర్ 9 లోగా ఉద్యమకారులకు గుర్తింపు కార్డులతో పాటు ఇతర హామీలు అమలు చేసే ప్రయత్నం చేస్తామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అందుకు సానుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page