Sunday, November 1, 2026
No menu items!
HomeGREATER HYDERABADపట్టభద్రుల ఎమ్మెల్సీ స్వ‌తంత్ర‌ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మణా చారి పోటీ

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వ‌తంత్ర‌ అభ్యర్థిగా డాక్టర్ లక్ష్మణా చారి పోటీ

📰 Generate e-Paper Clip

అంబ‌ర్‌పేట‌, అక్టోబర్ 31, ( అద్దం న్యూస్ ) :   

 యువకులు, స్వ‌చ్ఛంద‌ కార్యకర్తలు, విద్యార్థులు, ప్రజల అభీష్టం మేరకే హైదరాబాద్, రంగారెడ్డి మహబూబ్‌న‌గ‌ర్ నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్వ‌తంత్ర అభ్యర్థిగా తాను పోటీ చేస్తున్నట్లు ప్రముఖ సంఘ సేవకులు, ప్రేరణ బాలలవేదిక రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి లక్ష్మణాచారి తెలిపారు. నాలుగు దశాబ్దాల కాలంలో ప్రైవేటు కళాశాలలో లెక్చరర్‌గా ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయునిగా, ఉపాధ్యాయునిగా పని చేసి సుదీర్ఘ అనుభవం గడించిన లక్ష్మణాచారి మాట్లాడుతూ… విద్య, ఉపాధి రంగ సమస్యల పై పూర్తి అవగాహన ఉందనీ వాటి పరిష్కారాల కొరకు పోరాటం చేస్తానన్నారు. ప్రేరణ బాలల వేదిక ద్వార వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలోని వేలాది మంది వలస కార్మిక బాలలకు విద్యావకాశాలను కల్పించినట్లు పేర్కొన్నారు. సామాజిక సేవకుగాను ప్రముఖ వ్యక్తులు, సంస్థల నుండి జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు, ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు. బాలజాగృతి వినూత్నకార్యకలాపాన్ని ఒక ఉద్యమంగా చేపట్టి, బాలకార్మికులను పని నుండి విముక్తులను చేశాన‌న్నారు. పర్యావరణ జాగృతి పై ప్రజలలో అవగాహనా కార్యక్రమాలను నిర్వహించామ‌న్నారు. యువ పట్ట భద్రులకు ఉపాధి అవకాశాలు, విద్యాహక్కు చట్టం అమలు, ఉద్యోగ సమస్యలపై పరిష్కరించే దిశగా ప్రజాసేవ చేయుటకు అవకాశం కల్పించాలని, ప్రలోభాలకు లొంగకుండా ఎన్నికలలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. నియోజకవర్గ ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదించి తమకు ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణాచారి విజ్ఞప్తి చేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page