సికింద్రాబాద్, ఏప్రిల్ 9, అద్దం న్యూస్ : భారత రాజ్యాంగం, మహనీయుల ఔన్నత్యం గూర్చి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఆదం సంతోష్ కుమార్ తెలిపారు. బుధవారం చౌద్ధనగర్ డివిజన్‌లో సికింద్రాబాద్ నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇంచార్జ్ అదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా తెలంగాణా రాష్ట్ర వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత హాజరయ్యారు. ఈ సందర్భంగా బాపూజీ, డాక్టర్ అంబేద్కర్, భారత రాజ్యాంగం చిత్రపటాలను చేతిలో పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు మహనీయుల గురించి, రాజ్యాంగం గురించి వివరించి వాటి విలువలను తెలియజేసారు. అదం సంతోష్ మాట్లాడుతూ.. భారతదేశ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగ విలువల పై ప్రజల్లో అవగాహన పెంచడంమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగాన్ని బీజేపీ పార్టీ అ అణగదొక్కాలని చూస్తుందన్నారు. గాంధీ అంబెడ్కర్ ఆశయాలను సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రధానికి పేద ప్రజల కంటే బడా బాబులే ముఖ్యం అన్నారు. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదు, అంబెడ్కర్, గాంధీ పూలే లాంటి గొప్ప వాళ్ళ ఆలోచనలతో కూడిన ఒక పవిత్ర గ్రంథం అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన నా దృష్టికి తీసుకొని రావాలన్నారు. యువకుల కోసం యువ వికాసం పథకం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ కల్పిస్తున్నామన్నారు. 












Leave a Reply