జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ స‌త్తా చాటాలి – బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్

జిహెచ్ఎంసి ఎన్నిక‌ల్లో బిఆర్ఎస్ స‌త్తా చాటాలి

– బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, మాజీ మంత్రి కెటిఆర్

మాజీ మంత్రి కేటీఆర్ ను  సత్కరిస్తున్న బేగంబజార్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శివశంకర్ శర్మ, ట్రంపు బాయ్ తదితరులు.

గోషామహల్, సెప్టెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   బేగంబజార్ డివిజన్‌లో టిఆర్ఎస్ పార్టీ బలోపేతం చేసే దిశగా, ప్రతి టిఆర్ఎస్ కార్యకర్త సైనికులు పనిచేయాలని, త్వరలో జరగబోయే జిహెచ్ఎంసి ఎన్నికల్లో సత్తా చాటాలని బిఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్‌, బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు, ఈ మేరకు శుక్రవారం బేగంబజార్ డివిజన్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు శివశంకర్ శర్మ, శంకర్ యాదవ్, ప్రదీప్ రాజ్, శంకర్ పోలా, రామన్ యాదవ్, విష్ణు, అనుప్ రాజ్, ప్రసాద్ లో ప్రతి నిధులు బృందం కేటీఆర్ ను కలిశారు. ఈ సంద‌ర్భంగా బేగంబజార్‌ డివిజన్‌లో బిఆర్ఎస్ పార్టీని, బలోపేతం చేసే దిశ‌గా తీసుకుంటున్న చర్యల పైన కేటీఆర్ తో చర్చించారు. అదే విధంగా బేగంబజార్‌లో నెలకొన్న ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ అధికారులు నిలదీస్తున్నామని శివశంకర్ శర్మ తెలిపారు.


– 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page