ఆమెలో మ్యాజిక్..!

ఆమెలో మ్యాజిక్..!

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక లీడ్ రోల్ లో రూపొందిన ఛాంపియన్ మూవీ డిసెంబరు 25న విడుదల కానున్న విషయం తెలిసిందే. ప్రదీప్ అద్వైతం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాలీవుడ్ బ్యూటీ అనస్వర రాజన్ (Anaswara Rajan) హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీతోనే ఆమె (Anaswara Rajan) టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుంది. మలయాళంలో అనేక సినిమాల్లో నటించిన అమ్మడు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. ఇంకా తెలుగు డెబ్యూ మూవీ రిలీజ్ అవ్వకుండానే ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. మూవీ ప్ర మోషన్స్ లో సందడి చేస్తూ అందరి దృష్టిని తన వైపునకు తిప్పుకుంది.

ముఖ్యంగా టీజర్, ట్రైలర్ అదిరిపోవడంతో అంతా ఆమె (Anaswara Rajan) కోసం మాట్లాడుకుంటున్నారు. సినిమా రిలీజ్ అయ్యాక ఆమెకు ఆఫర్స్ కచ్చితంగా వస్తాయని చెబుతున్నారు. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న అనస్వర తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారే ఛాన్స్ ఉందని కామెంట్లు పెడుతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ కూడా ఆమె (Anaswara Rajan)లో మ్యాజిక్ ఉందన్న విషయం తెలిసిందే..

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page