పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయండి
• జిహెచ్ఎంసి కమిషనర్‌ను కోరిన గాంధీనగర్ కార్పొరేటర్ పావని
హైదరాబాద్, ఫిబ్రవరి 9, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్‌కు ప్రభుత్వం మంజూరు చేసిన జిహెచ్ఎంసి కార్పొరేటర్ నిధులు రూ.2 కోట్ల నుండి రూ.1 కోటి నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభోత్సవాలు జరపాలని కార్పొరేటర్ ఎ.పావని కోరారు. ఈ మేరకు సోమవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్‌వి.కర్ణన్‌ను కలిసి కార్పొరేటర్ పావని వినతి పత్రాన్ని సమర్పించారు. జిహెచ్ఎంసి కార్పొరేటర్ ఫండ్స్‌లోని మరో రూ.1 కోటి రూపాయలను వెంటనే మంజూరు చేయాలని, వాటితో పాటు పెండింగ్‌లో ఉన్న డివిజన్ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని కమిషనర్‌ను కార్పొరేటర్ పావని కోరారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ వెంటనే అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ఆదేశాలు జారీ చేస్తూ పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని కార్పొరేటర్ పావని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ పాల్గొన్నారు.













Leave a Reply