బోనాల సందర్భంగా రోడ్డు ప్యాచ్ వర్క్ పనుల పర్యవేక్షణ
హైదరాబాద్, జూలై 25, ( అద్దం న్యూస్ ) : బోనాల పండుగ సందర్భంగా ముషీరాబాద్ డివిజన్ పరిధిలోని రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను చేయిస్తున్నామని డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. డివిజన్ పరిధిలోని పలు దేవాలయాల వద్ద రోడ్ల ప్యాచ్ వర్క్ పనులను శనివారం చేపట్టారు. ఈ పనులను శ్రీధర్‌రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆదేశాల మేరకు బోనాల సందర్భంగా అన్ని దేవాలయాల పరిసరాల్లో గుంతలుగా ఉన్న రోడ్లకు ప్యాచ్ వర్క్ పనులను అధికారులు చేపట్టారన్నారు. బోనాల ఉత్సవాలకు వచ్చే మహిళా భక్తులు, పోతరాజుల యాత్రలకు ఎటువంటి ఆటంకం కలుగకుండా అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.![]()

![]()












Leave a Reply