గుర్తు తెలియని వ్యక్తి మృతి

 

హైదరాబాద్, అద్దం న్యూస్ :      రాంన‌గ‌ర్ డివిజ‌న్ బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య పార్క్ ఫుట్‌పాత్ పై స్పృహ లేకుండా 45-50 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు గ‌ల ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ప‌డి ఉన్నాడ‌ని ఈ నెల 14వ తేదీన రాత్రి 8 గంట‌ల స‌మ‌యంలో చిక్క‌డ‌ప‌ల్లి పోలీసుల‌కు సమాచారం వ‌చ్చింది. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వెళ్లి 108 అంబులెన్స్‌ను పిలిపించి చూడ‌గా అప్ప‌టికే ఆ వ్య‌క్తి మృతి చెందిన‌ట్టు అంబులెన్స్ సిబ్బంది గుర్తించారు. ఈ మేర‌కు పోలీసులు గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మృత‌దేహాన్ని గాంధీ మార్చురికి త‌ర‌లించారు. మృతుడు సుంద‌ర‌య్య పార్క్ చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల్లో భిక్షాట‌న చేస్తూ క‌నిపించేవాడ‌ని, అత‌ని పేరు, ఇత‌ర వివ‌రాలు ఏమి తెలియ‌ద‌ని స్థానికులు పోలీసులకు చెప్పారు. ఈ వ్య‌క్తిని ఎవ‌రైనా గుర్తిస్తే చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌కు వ‌చ్చి సంప్ర‌దించాల‌ని పోలీసులు కోరారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page