హైదరాబాద్, అద్దం న్యూస్ : గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ నాగరాజు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.. ఈనెల 12వ తేదీ సాయంత్రం ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కింద స్పృహ లేకుండా ఓ వ్యక్తి పడిపోయి ఉన్నాడని సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అంబులెన్స్ ను పిలిపించారు. అంబులెన్స్ సిబ్బంది ఆ వ్యక్తిని పరిశీలించి చూడగా అప్పటికే మృతి చెంది ఉన్నట్లు ధృవీకరించారు. మృతుడు 40 -45 సంవత్సరాల వయస్సు ఉండవచ్చని, ఆర్టీసీ క్రాస్ రోడ్ చౌరస్తాలో, పలు సినిమా థియేటర్ల వద్ద భిక్షాటన చేస్తూ ఉండేవాడని స్థానికులు చెప్పారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు అతని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురికి తరలించారు. ఎవరైనా ఈ వ్యక్తిని గుర్తిస్తే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని ఎస్ఐ కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply