అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఫుడ్ డెలివరీలకు (Delivery Boys) డిమాండ్ పీక్స్‌లో ఉంటుంది. సరిగ్గా ఇదే సమయంలో వేతనాలు, పని పరిస్థితులు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తూ డెలివరీ వర్కర్ల (Delivery Boys) యూనియన్లు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు స్విగ్గీ (Swiggy), జొమాటో (Zomato) సంస్థలు తమ డెలివరీ పార్ట్‌నర్లకు భారీ ‘ఇన్సెంటివ్స్’ (Incentives) ప్రకటించాయి.
ఆఫర్ల వివరాలు:
జొమాటో: డిసెంబర్ 31 సాయంత్రం 6 నుంచి రాత్రి 12 గంటల మధ్య ‘పీక్ అవర్స్’లో డెలివరీ చేసే ఒక్కో ఆర్డర్‌కు రూ.120 నుండి రూ.150 వరకు చెల్లిస్తామని జొమాటో తెలిపింది. దీని ద్వారా ఒక్క రోజులోనే డెలివరీ పార్టనర్‌లు (Delivery Boys) రూ.3,000 వరకు సంపాదించుకునే అవకాశం కల్పించింది. అలాగే ఆర్డర్ రద్దుపై పెనాల్టీలను తాత్కాలికంగా ఎత్తివేసింది.
స్విగ్గీ: డిసెంబర్ 31, జనవరి 1 రెండు రోజుల్లో కలిపి డెలివరీ పార్ట్‌నర్లు (Delivery Boys) ఏకంగా రూ.10,000 వరకు సంపాదించుకునే అవకాశాన్ని స్విగ్గీ కల్పించింది. న్యూ ఇయర్ రాత్రి పీక్ అవర్స్‌లో పనిచేస్తే రూ.2,000 వరకు అదనపు పేమెంట్ ఆఫర్ చేస్తోంది. జెప్టో (Zepto) కూడా ఇదే బాటలో నడిచింది.
క్రిస్మస్ రోజున జరిగిన సమ్మె ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, న్యూ ఇయర్ సీజన్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో కంపెనీలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం తెచ్చిన సోషల్ సెక్యూరిటీ కోడ్-2020 ప్రకారం గిగ్ వర్కర్ల (Delivery Boys) సంక్షేమంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ పరిణామాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply