కాచిగూడ, అక్టోబర్ 22, ( అద్దం న్యూస్ ) :
శ్మశాన వాటికకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు తలేత్తకుండ సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అంబర్‌పేట హిందూ శ్మశాన వాటిక ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు రాజేందర్ పటేల్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… జీహెచ్ఎంసీ అధికారులు సహాకారం అందిస్తే శ్మశాన వాటికను మరింతగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం కోసం లక్షలు వెచ్చించి దశదిన కర్మలు, కర్మలకు ప్రత్యేక గదులను నిర్మించి, నూతన సీసీ కెమారాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ విగ్, సాయి గిరిధర్, భీమాగౌని కృష్ణాగౌడ్, రతన్ విద్యాసాగర్, సత్యనారాయణ పాల్గొన్నారు.






