Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADవిద్యార్థుల‌కు ఉచితంగా నోటు పుస్త‌కాలు, ప‌ల‌క‌ల పంపిణీ

విద్యార్థుల‌కు ఉచితంగా నోటు పుస్త‌కాలు, ప‌ల‌క‌ల పంపిణీ

📰 Generate e-Paper Clip

పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ఆధ్వ‌ర్యంలో
విద్యార్థుల‌కు ఉచితంగా నోటు పుస్త‌కాలు, ప‌ల‌క‌ల పంపిణీ

హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :   జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్, స్మారక సంస్థ ట్రస్ట్ చైర్ పర్సన్ కోడూరి శ్రీదేవి ఆధ్వర్యంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లోని విద్యార్థుల‌కు ఉచితంగా నోటు పుస్త‌కాలు, అంగ‌న్‌వాడి కేంద్రంలోని చిన్నారుల‌కు ప‌ల‌క‌ల పంపిణీ జ‌రిగింది. మంగ‌ళ‌వారం ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం అడిక్‌మెట్ డివిజ‌న్ విద్యాన‌గ‌ర్ ఎస్ఈఎస్ ప్రభుత్వ పాఠశాలలో, రాంనగర్ అంగన్‌వాడి కేంద్రాల‌కు చెందిన 300 విద్యార్థినీ, విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, పలకలను అందచేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రొయ్యూరు శేష సాయి, టిపిసిసి కార్యదర్శి కేశవ్, బ్రాహ్మణ సంఘం రాష్ట్ర వైస్ చైర్మన్ పొన్నాడ సుబ్రహ్మణ్యం, బిఆర్ఎస్ నాయకుడు మేడి సత్యనారాయణ, పింగళి వెంకయ్య చారిటబుల్ స్మార‌క‌ సంస్థ చైర్మ‌న్‌ కోడూరి శ్యామలరావు, సంస్థ ప్రధాన కార్యదర్శి బంగారు ప్రశాంత్ కుమార్, సంస్థ కార్యదర్శి ఎస్.సుధాకర్ రెడ్డి, విజయ్ కుమార్ యాదవ్, కరణం సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page