Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADఛ‌లో కోకాపేట్.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం... కరపత్రాల ఆవిష్కరణ

ఛ‌లో కోకాపేట్.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం… కరపత్రాల ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

 ఛ‌లో కోకాపేట్.. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం…
కరపత్రాల ఆవిష్కరణ

హైద‌రాబాద్‌, జూన్ 16, ( అద్దం న్యూస్ ) :   ఆరె కటిక అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో కోకాపేట్ లో జూలై 10 వ తేదీన జ‌రుగ‌నున్న శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. బోనాల పండుగ.. జాతరకు సంబంధించిన క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం మంగ‌ళ‌వారం జ‌రిగింది. బాగ్‌లింగంప‌ల్లి సుంద‌ర‌య్య విజ్ఞాన‌కేంద్రంలో కొమురెల్లి మల్లన్న శ్యామ్ క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కొమరెల్లి శ్యామ్ మాట్లాడుతూ… శ్రీ శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం.. బోనాల పండుగ.. జాతరకు కుల బంధువులందరూ సకుటుంబ సపరివారంగా బంధుమిత్రులతో హాజరు కావాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా ఆరె క‌టిక అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్య‌క్షుడు భూంప‌ల్లి అశోక్ దాదా మాట్లాడుతూ… ఆరెకటికల ఐక్యతను చాటే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ క‌ర‌ప‌త్రాల ఆవిష్క‌ర‌ణ‌ కార్యక్రమంలో ఆరె కటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేష్, కోశాధికారి కేడి దినేష్, జాయింట్ సెక్రటరీ జె.శ్రీనివాస్, రాష్ట్ర మహిళా విభాగం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వనజ, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు సరస్వతి, జ‌హంగీర్‌, రాజేష్, మహేందర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page