అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బాలీవుడ్ గ్రీక్ గాడ్‌గా గుర్తింపు పొందిన హృతిక్ రోషన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారారు. రణ్‌వీర్ సింగ్ ‘డాన్ 3’ నుంచి తప్పుకున్న నేపథ్యంలో ఆ స్థానంలో హృతిక్‌ను తీసుకోవాలన్న ఆలోచన మేకర్స్‌లో ఉన్నట్లు బీటౌన్ టాక్. దర్శకుడు ఫర్హానా అక్తర్.. హృతిక్‌నే బెస్ట్ ఛాయిస్‌గా భావిస్తున్నాడని సమాచారం. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. మరోవైపు ‘వార్ 2’ ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ‘క్రిష్ 4’కి ఆర్థిక అడ్డంకులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు కొత్త ‘డాన్’ పరిచయం కాబోతున్నాడా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ సినీవర్గాలు. బాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీల్లో ఒకటైన ‘డాన్’ మూడో భాగంలో రణ్‌వీర్ సింగ్ నటించనున్నాడని వార్తలు రాగా.. కొద్దిరోజులకే ఆయన తప్పుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన స్థానంలో హృతిక్ రోషన్‌ను తీసుకోవాలన్న ఆలోచన మేకర్స్‌లో ఉన్నట్లు బీటౌన్‌లో జోరుగా చర్చ జరుగుతోంది. ‘‘రణ్‌వీర్ తప్పుకున్న తర్వాత ఆ పాత్రకు హృతిక్ మాత్రమే సరిగ్గా సరిపోతారని చిత్రబృందం భావిస్తోంది. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నప్పటికీ త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది’’ అని హృతిక్‌కు సన్నిహితంగా ఉన్న వర్గాలు చెబుతున్నాయి.
‘డాన్’లో అమితాబ్ బచ్చన్, ‘ డాన్ 2 ’లో షారుఖ్ ఖాన్ నటించగా.. ‘డాన్ 3’లో హృతిక్ నటించనున్నాడన్న వార్త సినీ ప్రియులకు ఆసక్తిగా మారింది. ‘డాన్ 2’లో హృతిక్ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వడం కూడా ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. అందుకే ఈసారి కొత్త ‘డాన్’గా హృతిక్‌నే బెస్ట్ ఛాయిస్‌గా దర్శకుడు ఫర్హానా అక్తర్ భావిస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే దీనిపై ప్రాథమిక చర్చలు జరిగినట్లు బీటౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply