ఫరాజ్ మియా మసీదు వీధిలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు ప్రారంభం
హైదరాబాద్, డిసెంబర్ 13, అద్దం న్యూస్ : ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో ముషీరాబాద్ డివిజన్ ఫరాజ్ మియా మసీదు సమీపంలో డ్రైనేజీ పైప్‌లైన్ల పనులు ప్రారంభం అయ్యాయని బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎండి.జావీద్ ఖాన్ తెలిపారు. శనివారం ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో ప్రారంభమైన డ్రైనేజీ పైప్‌లైన్ల నిర్మాణ పనులను బిఆర్ఎస్ పార్టీ నాయకులు మునావర్‌చాంద్, జాఫర్, మున్నా ఖాన్, సయ్యద్ సర్వర్ లతో కలిసి జావీద్ ఖాన్ పరిశీలించారు. ఈ సందర్భంగా జావీద్ ఖాన్ మాట్లాడుతూ… ఎమ్మెల్యే ముఠా గోపాల్ చోరవతో పఠాన్‌బస్తీలో ఫరాజ్ మియా మసీదు వద్ద డ్రైనేజీ పైప్‌లైన్లను వేయడం జరుగుతుందన్నారు. అలాగే అమీర్ గరీబ్ దుకాణం నుంచి దయారా మార్కెట్ చౌరస్తా వరకు త్వరలో డ్రైనేజీ పైప్‌లైన్ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయన్నారు.















Leave a Reply