ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో నిలిపేందుకు కృషి – సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

ప్రజలకు వైద్య సేవలు అందుబాటులో నిలిపేందుకు కృషి

– సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్

సికింద్రాబాద్, సెప్టెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :     నిరుపేదలకు ఉచితంగా మంచి వైద్యాన్ని అందించేందుకు తాము నిరంతరం శ్రమిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యుడు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. బౌద్ధానగర్ ఎస్ఆర్‌వి మల్టీ స్పెషాలిటి క్లినిక్ లో ఆదివారం మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని పద్మారావు గౌడ్ ప్రారంభించి, ఉచితంగా మందులను రోగులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప‌ద్మారావుగౌడ్ మాట్లాడుతూ… వైద్య సేవలను అందించే వ్యక్తులు, సంస్థలను ప్రోత్సహిస్తామని తెలిపారు. ఎస్ఆర్‌వి మల్టీ స్పెషాలిటి క్లినిక్ తో పాటు విబ్సున్ ఫార్మా, సుంకు ట్రస్ట్ వంటి వివిధ సంస్థల ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సుంకు రామచందర్ తెలిపారు. ఖరీదైన వైద్య పరేక్షలతో పాటు రోగులకు ఖరీదైన మందులు కూడా పూర్తిగా ఉచితంగా ఈ శిబిరంలో అందించేలా ఏర్పాట్లు జరిపామని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేటర్ కంది శైలజ, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page