...

అవినీతి బాగోతాన్ని పత్రికలు బయట పెడుతున్నాయనే అక్కస్సుతో పత్రికలపై ఆక్రోషం వ్యక్తం చేయడం ఎమ్మెల్సి క‌విత‌ మానసిక స్థితికి దర్పణం – టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు సాయిబాబా

హైదరాబాద్, జూన్  23, అద్దం న్యూస్ :    “ఆడలేక మద్దెల ఓడు” అన్నట్లు జాగృతి అధ్యక్షురాలు కవిత నిన్నటిదాకా సంస్థను నడిపి, తన అవినీతి బాగోతాన్ని పత్రికలు బయట పెడుతున్నాయనే అక్కస్సుతో పత్రికలపై ఆక్రోషం వ్యక్తం చేయడం ఆమె మానసిక స్థితికి దర్పణం టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్య‌క్షుడు పిన్న‌మ‌నేని సాయిబాబా అన్నారు. హైద‌రాబాద్ టిడిపి న‌గ‌ర కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… తెలంగాణ మహిళా సమాజానికి మచ్చ తెచ్చే విధంగా కాసుల కోసం అవినీతి డబ్బుల కోసం లిక్కర్ వ్యాపారం ముసుగులో జైలు జీవితం గడిపిన ఆదర్శవంతురాలు క‌విత అని దుయ్య‌బ‌ట్టారు. బతుకమ్మ ముసుగులో దేశ విదేశాలలో ప్రజాధనం దోపిడీకి పాల్పడిందని ఆరోపించారు. బతకమ్మ పుట్టడానికి నేనే కారణం అనే విధంగా వ్యవహరించిన కవిత ఆరోజు బతుకమ్మ చీరల వ్యవహారంలో నాసిరకం చీరలు ప్రజలకు అంటగట్టి ఎన్ని కోట్లు మింగారో ప్రజలు ఇంకా మర్చిపోలేదని అన్నారు. కవిత తన ఉనికిని ప్రజలు మరిచిపోతున్నారనే బాధతో నోటికొచ్చిన విధంగా మాట్లాడుతుంటే ఆమెకు బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు వంత పాడటాన్ని చూస్తుంటే బిఆర్ఎస్ లో ఆయన స్థానం భద్రంగా లేదని అర్థమవుతుందని ధ్వ‌జ‌మెత్తారు. కెసిఆర్ తన కొడుకుకే పట్టం కడతాడని, తనను ఇంటి వరకే పరిమితం చేస్తాడని ఆలోచనా భయంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లుతున్నారన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మళ్లీ పుంజు కుంటుందని ప్రజలు భావిస్తున్న తరుణంలో తమ రాజకీయ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని భయం ఏర్ప‌డింద‌న్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం సంతరించుకుంటుందన్నా భయంతో అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని విమ‌ర్శించారు. తన రాజకీయ లబ్ధి కోసం ఇతరులను మీద దుమ్మెత్తి పోయడానికి అసలు ఆంతర్యమ‌న్నారు. అదే విధంగా కవిత అవినీతి ద్వారా సంపాదించిన కోట్లాది రూపాయలు ప్రజాధనం కాపాడు కోవడానికి కొత్తగా తాను రాజకీయ పార్టీని ఏర్పాటు చేయాలన్నఆలోచనలో ఉంద‌న్నారు. ప్రజలు ఈ విషయాలన్నీ గమనిస్తున్నారని అన్నారు.

తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలను వంచించి వీరికి ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా పాత్ర కచ్చితంగా ఉంటుందని తెలియజేస్తూ, ప్రభుత్వం వీరిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసారు. పోలవరం బ్యాక్ వాటర్ వల్ల మునిగిపోయే 6 గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని, ఈవంకతో తెలంగాణ వాదాన్ని అడ్డుపెట్టుకొని ప్రజల్లో తమ ఉనికిని రాజకీయ భవిష్యత్తును కాపాడుకునే ప్రయత్నంలో భాగమేనని సాయిబాబా అన్నారు. అందినంత కాలం ప్రజాధనం దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకున్న కవిత, హరీష్ ఇద్దరూ చంద్రబాబు నాయుడు పై అవాక్కులు చవాక్కులు మాట్లడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టిడిపి సికింద్రాబాద్ పార్ల‌మెంట్ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు నల్లెల కిషోర్, పి.బాలరాజ్ గౌడ్, నాయ‌కులు ఎస్.ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.