మార్క రమేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయ్ యాదవ్ బర్త్ డే వేడుకలు
హైదరాబాద్, సెప్టెంబర్ 17, అద్దం న్యూస్ : ఆల్ ఇండియా యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు విజయ్ యాదవ్ బర్త్ డే వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆల్ ఇండియా యాదవ మహాసభ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో విజయ్ యాదవ్‌కు సన్మానం జరిగింది. ఈ సందర్భంగా విజయ్ కుమార్‌కు పుష్పగుచ్చం అందచేసి శాలువ కప్పి కేక్ కట్ చేసి తినిపించిన రమేష్ కుమార్ యాదవ్ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యాదవ మహాసభ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ… ఆల్ ఇండియా యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు విజయ్ యాదవ్ అంచెలంచెలుగా ఎదగాలని కోరారు. యాదవ హక్కుల కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారన్నారు. కరోనా సమయంలో విజయ్ యాదవ్ ప్రజలకు నిస్వార్థసేవలను అందించారన్నారు. ఈ సందర్భంగా ఆల్ ఇండియా యాదవ మహాసభ గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు విజయ్ యాదవ్ మాట్లాడుతూ… యాదవ మహాసభ ముషీరాబాద్ నియోజకవర్గం సీనియర్ నాయకుడు మార్క రమేష్ కుమార్ యాదవ్ కు మంచి భవిష్యత్ ఉందన్నారు. యాదవులందరిని కలుపుకొని మరిన్ని సేవలను నిర్వహించాలన్నారు. విజయ్ కుమార్‌కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన వారిలో ప్రణయ్, వర్షిత్, దుర్గసాయి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

















Leave a Reply