బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్షను కొనసాగించాలి – ఐద్వా

బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్షను కొనసాగించాలి – ఐద్వా

హైదరాబాద్, డిసెంబ‌ర్ 26, అద్దం న్యూస్ :   ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో మైనర్ బాలికపై దారుణమైన అత్యాచారానికి పాల్పడి ఆమె తండ్రిని హత్య చేసిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ కు పడిన జీవిత ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం తీవ్ర ఆందోళనకరమని, ఆ ఉత్తర్వులను తక్షణం నిలిపివేయాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్సులు ఏ.పద్మ, వై.వరలక్ష్మి, రాష్ట్ర సహాయ కారదర్శి కె.నాగలక్ష్మి తెలిపారు. దీనికి నిరసనగా శుక్ర‌వారం నిర్వహించిన ధర్నా లో పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ… ఉన్నావ్ లో 2017 లో జరిగిన ఈ అత్యాచార ఘటనలో కుల్దీప్ సింగ్ సెంగార్ కు శిక్ష పడేందుకు బాధితురాలు చాలా రోజులు పోరాడాల్సి వచ్చిందన్నారు. చివరికి ఆమె తండ్రిని, ఆమె అత్తలను కూడా దోషిగా ఉన్న కుల్దీప్ సింగార్ హత్య చేయించాడని ఇంత తీవ్రమైన నేరాలు చేసి యావజ్జీవ‌ కారాగార శిక్ష అనుభవిస్తున్న ఇతనికి ఢిల్లీ హైకోర్టు శిక్షను నిలిపివేస్తూ బెయిల్ ఇవ్వడం మహిళలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందని వారు తెలిపారు.

బేటీ బచావో అని చెప్తున్న ప్రభుత్వ నేతల చర్యలు ఆచరణలో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నాయని వారు చెప్పారు. రేపిస్టులకు శిక్షలు నిలిపివేసి బెయిల్ ఇచ్చి బయటకు పంపితే బాధితులకు రక్షణ ఏముందని ఇది సమాజానికి ఏమి సంకేతం ఇస్తుందని వారు ప్రశ్నించారు. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఈ శిక్ష నిలుపుదల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని బాధితురాలికి సరైన రక్షణ కల్పించాలని ఐద్వా హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో షబానా బేగం, బాలామణి, ఫర్జానా, ఉష, నజ్మా, శ్వేత, మౌలానీ బీ, అంజమ్ బేగం తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page