కొండ లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ

హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 110వ జయంతి వేడుకలు శనివారం ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అశోక్‌నగర్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరై కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో కొండా లక్ష్మణ్ బాపూజీ పాత్ర మరువలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్, నాయకులు గుర్రం శంకర్, బీజేపీ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.నవీన్, ఆనంద్‌రావు, శ్రీకాంత్, రాజు, శ్రీనివాస్ యాదవ్, నీరజ్, పద్మశాలి ప్రజా సంఘం ముషీరాబాద్ నియోజకవర్గం అధ్యక్షురాలు బోనం ఊర్మిళ, లక్ష్మీ గణపతి దేవాలయం ఛైర్మన్ మారశెట్టి నర్సింగ్‌రావు, ఎయిర్‌టెల్ రాజు, పున్న సత్యనారాయణ, ప్రశాంత్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply