హైదరాబాద్, నవంబర్ 12, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ అరుంధతినగర్ బస్తీలో గత పక్షం రోజులుగా పేరుకుపోయిన చెత్తకుప్పను స్థానిక కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ ఆదేశాల మేరకు జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు. బస్తీలో చెత్త పేరుకుపోవడంతో తీవ్ర దుర్వాసన ఏర్పడడం వల్ల ఇబ్బందిగా ఉందని బస్తీవాసులు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్ కు ఫిర్యాదు చేయడంతో స్పందించిన కార్పొరేటర్ చెత్తను తొలగించాలని జిహెచ్ఎంసి సిబ్బందిని ఆదేశించారు. బుధవారం బస్తీలో చెత్తను జిహెచ్ఎంసి సిబ్బంది తొలగించారు. బస్తీలో జరుగుతున్న నూతన సివరేజి పైప్‌లైన్ పనుల వల్ల రోడ్డు తవ్వకాలతో చెత్త తొలగించే వాహనాలు బస్థిలోకి వెళ్ళలేని కారణంగా చెత్త చొలగించలేదని, నేటి నుండి ప్రతి రోజు సిబ్బంది చెత్త తొలగిస్తారని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు నవీన్, ఓబీసీ మోర్చ అసెంబ్లీ కన్వీనర్ ఎం.ఉమేష్, బస్తీ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్, స్వామి దాస్, శ్రీనివాస్ గౌడ్, చందర్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png














Leave a Reply