వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే త‌ప్పించుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా – టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా

వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే త‌ప్పించుకుంటున్న జిహెచ్ఎంసి, హైడ్రా

– టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 15, అద్దం న్యూస్ :   వ‌ర్షాల వ‌ల్ల ప్ర‌జ‌లు ఇబ్బందులుప‌డుతుంటే జిహెచ్ఎంసి, హైడ్రా ఒక‌రి పై మ‌రొక‌రు చూస్తార‌ని త‌ప్పించుకుంటున్నాయ‌ని టిడిపి సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజ‌క‌వ‌ర్గం అధ్యక్షుడు పి.సాయిబాబా అన్నారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజాజీవనం అస్తవ్యస్తమవుతున్నా, లోతట్టు ప్రాంతాలు, హుస్సేన్‌సాగ‌ర్‌, మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారని.. నగరమా నరకమా అన్నట్టుందని సాయిబాబా అన్నారు. సోమ‌వారం హైద‌రాబాద్ దోమ‌ల‌గూడ‌లోని న‌గ‌ర టిడిపి కార్యాల‌యంలో జ‌రిగిన స‌మావేశంలో సాయిబాబా మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు దాటుతున్న ఎటువంటి ముందస్తు చర్యలు చేపట్టాలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తుందో ప్రజలకు తెలియజేయాలన్నారు. వర్షం వచ్చిందంటే మోరీలు, నాలాలు నిండిపోయి నగర ప్రజలకు నరకం తప్పేలా లేదని అన్నారు. నిన్న జరిగిన సంఘటనలో మామా అల్లుడు ఇద్దరు నీళ్లల్లో కొట్టుకుపోయారని, ముషీరాబాద్ వినోభానగర్‌లో ఒక పెద్ద మనిషి ఇద్దరు యువకులు కొట్టుకుపోవడం జరిగిందన్నారు. వర్షాల వల్ల కొట్టుకుపోవడమనేది గత 15 ఏళ్లుగా జరుగుతున్నా దీనికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వాలు ఆలోచించక పోవడం దురదృష్టకరమ‌న్నారు. నాలాలో ప్రాణాలు కోల్పాయిన వారిని ప్రభుత్వ హత్యలుగా భావించాల్సి వస్తుందని అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తానే స్వయంగా పర్యటించి పరిస్థితిని అవగాహన చేసుకుని ఆనాడే పూర్తి అధ్యయనం చేయడానికి కిర్లోస్కర్ కమిటీని ఏర్పాటు చేసారన్నారు. కీర్లోస్కర్ కమిటీని రూపొందించి నివేదిక ప్రకారము చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కమిటి సూచనల మేరకు నాలాల వెడల్పు, నాళాల పరిరక్షణకు రిటైనింగ్ వాలులు ఏర్పాటు చేసారన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితులలో నిరాశ్రయులైన వారికి తాత్కాలిక ఏర్పాటు చేయడం మొదలైన చర్యలు చేపట్టేవారు పునరావాసం కల్పించేవారన్నారు. గత కొన్ని సంవ‌త్స‌రాలుగా అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ, తర్వాత వచ్చిన కాంగ్రెస్ పార్టీలు కీర్లోస్కర్ కమిటీ సూచనలను తుంగలో తొక్కారని విమ‌ర్శించారు. ఒకసారి సంఘటన జరిగిన తర్వాత పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వాలు గత పదిహేనేళ్లుగా ఇదే మాదిరిగా కొనసాగడం ప్రజల ప్రాణాలంటే ఈ ప్రభుత్వాలకున్న నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు.                                                                                                      విపత్తు నిర్వహణ కమిటీని జిహెచ్ఎంసి నుండి హైడ్రాకు బదిలీ చేయడంతో పరిస్థితి అద్వానంగా తయారయిందన్నారు. జిహెచ్ఎంసి, ప్రభుత్వ వైఫల్యం కారణంగా నాలాల వల్ల ముగ్గురు బలై చనిపోయారని. కాబట్టి చనిపోయిన ముగ్గురి కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. హైడ్రాకో లేదో జిహెచ్ఎంసి స్పష్టంగా భాధ్యతలు కల్పించాలన్నారు. విశ్వనగరంగా వెలుగొందిన హైదరాబాద్‌ నగరం చినుకు పడితే భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితిలో ఉందని సామాన్యుడు ఆందోళన చెందుతున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబాలకు వెంటనే 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయ‌కులు నల్లెల్ల కిషోర్, బాలరాజగౌడ్, ఎస్.ప్రకాష్, తడక వినోద్, సుక్రవేది తదితరులు పాల్గొన్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page