అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామందిని వేధించే ప్రధాన సమస్య మైగ్రేన్ (Migraine) లేదా వన్‌సైడ్ హెడేక్. ఈ నొప్పి వచ్చినప్పుడు తక్షణ ఉపశమనం కోసం చాలామంది పెయిన్ కిల్లర్స్‌ను ఆశ్రయిస్తుంటారు. అయితే, మన వంటింట్లో లభించే అల్లం (Ginger) ఈ సమస్యకు చక్కటి పరిష్కారం చూపుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
అల్లంలో ఉండే ‘జింజెరాల్’ (Gingerol), ‘షోగాల్స్’ (Shogaols) అనే క్రియాశీలక సమ్మేళనాలు మైగ్రేన్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి శరీరంలో మంటను, నొప్పిని తగ్గించే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. అలాగే మైగ్రేన్‌కు (Migraine) కారణమయ్యే రక్తనాళాలను ప్రేరేపించి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి. 2020లో పబ్ మెడ్‌లో ప్రచురించిన మెటా అనాలసిస్ ప్రకారం, అల్లం తీసుకున్న రెండు గంటల్లోనే మైగ్రేన్ నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుందని తేలింది.
సాధారణ తలనొప్పి లేదా మైగ్రేన్ (Migraine) వచ్చినప్పుడు అల్లం టీ లేదా కషాయం తాగడం మంచిది. నీటిలో అల్లం ముక్కలు వేసి మరిగించి, గోరువెచ్చగా అయ్యాక తేనె కలుపుకుని తాగవచ్చు. రుచి కోసం పుదీనా లేదా ధనియాలు కూడా జతచేయవచ్చు. ఈ సహజ చిట్కా నొప్పిని తగ్గించడమే కాకుండా, మైగ్రేన్ వల్ల కలిగే వికారాన్ని కూడా తగ్గిస్తుంది. అయితే తీవ్రమైన సమస్యలు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం మంచిది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply