

![]()
![]()

హైదరాబాద్, సెప్టెంబర్ 15, అద్దం న్యూస్ : ప్రభుత్వం వెంటనే ఆరె కటికలకు వైన్స్ టెండర్లలో 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా కోరారు. ఈ మేరకు సోమవారం ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ జాయింట్ కమిషనర్ ఎస్‌వై.ఖురేషి ని కలిసి మెమొరాండం అందచేశారు. ఈ సందర్భంగా ఆరె కటిక అభివృద్ధి సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి గజిబిన్కర్ భూంపల్లి అశోక్ దాదా మాట్లాడుతూ… 79 సంవత్సర కాలంలో ఆరె కటిక కులానికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. మటన్ వృత్తి, సారా వృత్తి జన్మతః ఆరె కటికలదేనని, 2021లో అప్పటి ప్రభుత్వం నూతన ఎక్సైజ్ పాలసీలో సైతం అన్యాయం చేసిందన్నారు. 2020 నుంచి 2023 సంవత్సరం వరకు 10 ఉరి వేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నారని, మటన్ వృత్తిని సాగించలేక అప్పులపాలై కుటుంబాన్ని పోషించుకోలేక బలవన్మరణాలకు పాల్పడ్డారన్నారు.
బిసి డి నుంచి బిసి ఏ హోదా కల్పిస్తూ జిఓ తేవాలన్నారు. రాష్ట్రంలోని మేకల మండిలను ఆధునీకరించి ఆరె కటికలను అప్పగించాలని, ఇంటిగ్రేటెడ్ మటన్ మార్కెట్లలో ఆరె కటికలకు పూర్తి హక్కు కల్పిస్తూ జిఓ తేవాలన్నారు. వైన్స్ టెండర్లలో 30 శాతం ప్రత్యేక కార్పొరేషన్‌ను కల్పించాలని, 500 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్సైజ్ అండ్ ప్రొహబిషన్ జాయింట్ కమిషనర్ ఎస్‌వై.ఖురేషి ని కలిసిన వారిలో ఆరెకటిక అభివృద్ధి సంఘం రాష్ట్ర కోశాధికారి కెడి. దినేష్, జాయింట్ సెక్రెటరీ జె.శ్రీనివాస్, కె.శివప్రసాద్. కె.రాజేష్, పుల్కల్ నిరాజ్వీర్, కమ్టేకర్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png











Leave a Reply