Friday, September 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADఈ నెల 7న హ్యాండ్లూమ్ వాక్

ఈ నెల 7న హ్యాండ్లూమ్ వాక్

📰 Generate e-Paper Clip

ఈ నెల 7న హ్యాండ్లూమ్ వాక్
– చేనేత దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన చిక్కా దేవదాసు

హైద‌రాబాద్‌, ఆగస్టు 2, ( అద్దం న్యూస్ ) : జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 7న చార్మినార్ నుండి చౌమ హల్లా ప్యాలెస్ వరకు హ్యాండ్లూమ్ వాక్ నిర్వహింపబడుతుందని చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు డాక్టర్ చిక్కా దేవదాసు తెలిపారు. చేనేత దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించిన చిక్కా దేవదాసు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో చేనేత వారోత్సవాలు ప్రభుత్వం చేనేత కార్మికులు నిర్వహించాలని జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చిక్కా దేవదాసు పిలుపునిచ్చారు. ఈ హెరిటేజ్ హ్యాండ్లూమ్ వాక్ లో ప్రభుత్వ ఉన్నతాధికారులు, వివిధ రంగాల విశిష్ట నాయకులు, చేనేత కళాకారులు, చేనేత ప్రేమికులు, పౌర సమాజం, మీడియా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. భారతీయ సాంప్రదాయంలో చేనేత రంగ విశిష్టతను, చేనేత కళాకారుల వృత్తి కళా నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొని భారతీయ చేనేత కళాకారులకు మద్దతు తెలుపవలసిందిగా చిక్కా దేవదాసు కోరారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు బండారి లక్ష్మి , సెక్రటరీ కొండ బత్తిని కృష్ణ సంతోషి , వై.శ్రీదేవి, అపర్ణ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page