Friday, September 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADTGSRTC : ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ఉద్యోగస్తుల‌కు ప్ర‌గ‌తి చ‌క్రం అవార్డుల ప్ర‌దానం

TGSRTC : ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ఉద్యోగస్తుల‌కు ప్ర‌గ‌తి చ‌క్రం అవార్డుల ప్ర‌దానం

📰 Generate e-Paper Clip

ఉత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచిన ఉద్యోగస్తుల‌కు ప్ర‌గ‌తి చ‌క్రం అవార్డుల ప్ర‌దానం

హైద‌రాబాద్‌, జూలై 31, ( అద్దం న్యూస్ ) :   ముషీరాబాద్ ఆర్టీసీ డిపో నుండి ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగస్తులకు ప్రగతి చక్రం అవార్డుల ప్రదానం కార్య‌క్ర‌మం శుక్ర‌వారం జ‌రిగింది. డిపో ఆవ‌ర‌ణ‌లో ముషీరాబాద్ డిపో మేనేజర్ జె.విజయ్ ఆధ్వర్యంలో ఈ అవార్డుల ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌రిగింది. ముషీరాబాద్ డిపో నుండి ఎంపికైన ఉత్తమ ప్రతిభ కనబరిచి డిపో కి అత్యధిక ఆదాయాన్ని అందించిన కండక్టర్లు పి.ఇందిర, ఎం.రేణుక, ఎన్‌.సువర్ణ, కె.బాలాజీ, ఎం.శ్రీనివాసులు, ఎన్‌వి. నర్సింలు, కెఎస్‌.రావు, జి.సంధ్య, బి.రాధమ్మ, పి.కవిత, కె.బాలాజీ, వై.స్వప్న, టిఎస్‌.గౌడ్, బి.ఆంధ్రావేణి లను డిపో మేనేజర్ జె.విజయ్ సత్కరించి నగదు పారితోషకం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page