హరికథలను భవిష్యత్ తరాలకు అందించాలి
– ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు శ్రీనివాసా వెంకట్రా ప్రగడ
సిటీ కల్చరల్, ఏప్రిల్ 5, అద్దం న్యూస్ : హరికథలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజ్ఞాభారతి అధ్యక్షుడు శ్రీనివాసా వెంకట్రా ప్రగడ అన్నారు. ఉగాది పండుగను పురస్కరించుకొని సంచలన స్కూల్ ఆఫ్ డ్యాన్స్ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు కళ్యాణ్ హంపి థియేటర్‌లో నిర్వహిస్తున్న వసంతోత్సవ వేడుకలు ఆరవ రోజు ప్రముఖ భాగవతారిని చలసాని లోహిత నిర్వహణలో సీతా కళ్యాణం హరికథ గానం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీనివాస వెంకట్రా ప్రగడ, బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రొయ్యూరు శేషసాయి పాల్గొని సంస్థ అధ్యక్షురాలు పద్మ కళ్యాణితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంచలన స్కూల్ ఆఫ్ డాన్స్ అధ్యక్షురాలు పద్మ కళ్యాణి అంతరించిపోతున్న ప్రాచీన కళలను కాపాడుతున్నారని కొనియాడారు. సభకు ముందు చలసాని రోహిత నిర్వహించిన హరికథ గానం ఆకట్టుకుంది.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply