హరినగర్ కమ్యూనిటీహాల్‌ను ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలి
– బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రేషం మల్లేష్ డిమాండ్
హైదరాబాద్, సెప్టెంబర్ 27, అద్దం న్యూస్ : ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ డివిజన్ హరినగర్‌లో సుమారు 78 లక్షల నిధులతో నిర్మించిన కమ్యూనిటీహాల్‌ను ప్రజా ఉపయోగంలోకి తీసుకురావాలని బిఆర్ఎస్ పార్టీ రాంనగర్ డివిజన్ మాజీ అధ్యక్షుడు రేషం మల్లేష్, సీనియర్ నాయకుడు సిరిగిరి శ్యామ్ లు డిమాండ్ చేశారు. శనివారం హరినగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ… రాంనగర్ డివిజన్ హరినగర్‌లో దివంగత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తన ఎమ్మెల్సీ కోటా నిధుల నుంచి రూ.78 లక్షల రూపాయల వ్యయంతో కమ్యూనిటీహాల్‌ను నిర్మించారన్నారు. కమ్యూనిటీహాల్ నిర్మాణం పూర్తయి మూడు సంవత్సరాలు పూర్తయిన ఇంతవరకు దాన్ని ప్రారంభించకుండా వృధాగా పెట్టారని తెలిపారు. జి ప్లస్ వన్ భవనాన్ని నిర్మించి ప్రజా ఉపయోగంలోకి తీసుకురావడంలో జిహెచ్ఎంసి అధికారులు నిర్లక్ష్యంగా వేరుస్తున్నారని ఆరోపించారు. ఈ కమ్యూనిటీహాల్ ప్రారంభమైతే హరినగర్ పరిసర ప్రాంతాలలోని పేద ప్రజలు చేసుకునే సామాజిక కార్యక్రమాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ విషయం పైన జిహెచ్ఎంసి కమిషనర్ వెంటనే స్పందించి కమ్యూనిటీహాల్ ప్రారంభోత్సవానికి తగిన చర్యలు చేపట్టాలని వారు కోరారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply