Saturday, September 19, 2026
No menu items!
HomeCrime NewsBangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

📰 Generate e-Paper Clip

Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందువు హత్య

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో హిందువులపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మణి చక్రవర్తి అనే ఓ కిరాణా దుకాణ వ్యాపారిపై గుర్తుతెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి చంపేశారు. రాణాప్రతాప్‌ బైరాగి అనే జర్నలిస్టు హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటుచేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

నర్సింగ్డి జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్‌సిందూర్‌ బజార్‌లో ఈ హత్య జరిగింది. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్‌లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. సోమవారం రాత్రి దుకాణంలో ఉండగా.. కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతనిపై దాడి చేశారు. ఈ ఘటనలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. విద్యార్థి నాయకుడు ఉస్మాన్‌ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటినుంచి దేశంలోని హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. మొత్తం 18 రోజుల్లో ఆరుగురు హిందువులు హత్యకు గురవడం ఆందోళన కలిగిస్తోంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page