సిటీ కల్చరల్, అద్దం న్యూస్ : ప్రముఖ రచయిత వైట్ల కిషోర్ కుమార్ (అచ్చంట) రచించిన చారిత్రక చిత్ర వైభవం పుస్తకావిష్కరణ సభ యువ కళావహిని ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలోని సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చారిత్రక చిత్రాల ప్రముఖ సినీనటి ప్రభ పాల్గొని పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చారిత్రక చిత్రలలోని సన్నివేశాలను ఇంత అద్భుతంగా పుస్తక రూపంలో వైట్ల కిషోర్ కుమార్ తీసుకురావడం సంతోషదాయకమన్నారు. పుస్తకం చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా సినీ విజ్ఞాన విశారధ ఎస్.వి.రామారావు, మాణికేశ్వరి దంపతులకు పుస్తకాన్ని అంకితమిచ్చారు. సాంస్కృతికబంధు డాక్టర్.అక్కినేని నాగేశ్వరరావు నాటక కళాపరిషత్ అధ్యక్షుడు సారిపల్లి కొండలరావు అధ్యక్షత వహించిన కార్యక్రమంలో ప్రముఖ సినీ దర్శకుడు రేలంగి నరసింహా రావు, ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయిమాధవ్, ప్రముఖ సినీ నటుడు సుబ్బరాయశర్మ, యువకళావాహిని అధ్యక్షుడు, కళావాచస్పతి లంక లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు ప్రముఖ గాయని సురేఖామూర్తి నిర్వహణలో ఆలపించిన చారిత్రక చిత్ర గీతాలు అలరించాయి.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply