మహేష్ ను ఇండియాకు రప్పించి.. అన్ని విధాలా ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్

మహేష్‌తో వీడియో కాల్‌లో మాట్లాడుతున్న కెటిఆర్
సిరిసిల్ల, మే 11, అద్దం న్యూస్ : గల్ఫ్ దేశంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సిరిసిల్ల కు చెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త మంద మహేష్‌ను ఇండియాకు రప్పించి, అన్ని విధాల ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ మహేష్ కుటుంబసభ్యులకు హామినిచ్చారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామానికి చెందిన మంద మహేష్ సౌదీలో జీవనోపాధి కోసం వెళ్లాడు. ఇటీవల కంపెనీ బస్సులో పనికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి.. మంద మహేష్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న కెటిఆర్ ఆదివారం సిరిసిల్ల నియోజకవర్గంలోని మండేపల్లి గ్రామంలోని మహేష్ ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. సౌదీలో చికిత్స పొందుతున్న మందం మహేష్‌తో వీడియో కాల్ ద్వారా కేటీఆర్ మాట్లాడారు. మనోళ్ళను పంపించి నీకు అండగా ఉండే విధంగా అన్ని రకాలుగా చూస్తానని మహేష్ కు కెటిఆర్ తెలిపారు. సొంత ఖర్చులతో ఇండియాకు రప్పిస్తానని మహేశ్ కు భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల పరంగా మహేష్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోడానికి ముందుంటానని కెటిఆర్ హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దు.. నాలుగు ఐదు రోజుల్లోనే సొంత ఖర్చులతో నిన్ను స్వస్థలానికి తీసుకువస్తాను అని కేటీఆర్ భరోసా ఇచ్చారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png












Leave a Reply