హైదరాబాద్, అద్దం న్యూస్ : ఐక్యతకు మారుపేరు ఇఫ్తార్ విందు అని ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్ నియోజకవర్గం అడిక్‌మెట్ డివిజన్ ఫాతిమా బేగం మసీదులో బుధవారం సాయంత్రం ఇఫ్తార్ విందు జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముషీరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన అనంతరం ఇఫ్తార్ విందును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఫాతిమా బేగం మసీదు అధ్యక్షుడు మహ్మద్ జహంగీర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మహ్మద్ ఖదీర్‌లకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ పండ్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపాల్ మాట్లాడుతూ… ఇఫ్తార్ విందులనేవి మతసామరస్యానికి ప్రతీక అని అన్నారు. ఏ మతం, ఏ కులం అనే తేడా లేకుండా అందరూ పాల్గొనేదే ఇఫ్తార్ విందు అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు ముఠా జైసింహా, బిఆర్ఎస్ పార్టీ నాయకులు అబ్బు, ఖలీల్, యూనుస్, రోశం బాలు, గురుదీప్‌సింగ్, మేడి సత్యనారాయణతో పాటు పలువురు ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply