Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADభగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

📰 Generate e-Paper Clip

భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం
» పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, పొడపంగి నాగరాజు

హైదరాబాద్, మార్చి 20, అద్దం న్యూస్ :   భగత్‌సింగ్ ఉద్యమ స్ఫూర్తితో మతోన్మాద పాసిస్తూ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదామ‌ని పిడిఎస్‌యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మహేష్, పొడపంగి నాగరాజు లు అన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్‌యు ) తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో హైద‌రాబాద్ విద్యానగర్ ఎస్‌విఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శుక్ర‌వారం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ ల 95 వ వర్ధంతి మార్చి 23 నుంచి 30 వరకు జరిగే వర్ధంతి సభల గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిడిఎస్‌యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.మహేష్, పొడపంగి నాగరాజు లు మాట్లాడుతూ… భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లు బ్రిటిష్ వలస పాలన పై తిరుగుబాటు జెండా ఎత్తి విప్లవాగ్ని రగిలించి భారత దేశంలో ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సోషలిజం, సమ సమాజ స్థాపన కొరకు తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా ఈ దేశం కొరకు అర్పించారన్నారు. 1915 మొదటి లాహోర్ కుట్ర కేసులో కర్తార్ సింగ్ శరభ తో పాటు 8 మంది గదర్ వీరులను ఉరి తీశారన్నారు. ఈ ఘటన భగత్‌సింగ్‌ను ఎంతగానో విప్లవ భావాల పట్ల ఆకర్షితులను చేసింది. గద్దర్ పార్టీ అనుశీలన సమితి లాంటి సంస్థ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయి.1919 ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో జరిగిన మారణ హోమం చూసి చలించి పోయిన భగత్‌సింగ్ చిన్న వయసులోనే బ్రిటీష్ వలస పాలకుల పైన ద్వేషాన్ని పెంచుకొని వారి చేతిలో బందీ అయిన భారతదేశాన్ని విముక్తి చేయాలని నిశ్చయించుకున్నాడ‌న్నారు.

  ఈ కేసులో భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల‌ను అరెస్టు చేసి 1931 మార్చి 23 వ తేదీన అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా ముగ్గురి యువ కిశోరాలను ఉరి తీశారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం రద్దు చేసేంత వరకు పోరాటాలు నిర్వహించాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తూ నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కనుక భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల‌ ఉద్యమ స్ఫూర్తితో పోరాటాలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్‌యు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.శ్రీనివాస్, రాష్ట్ర సహాయ కార్యదర్శి మంద నవీన్, రాష్ట్ర నాయకులు తీగల శ్యామ్, జిల్లా నాయకులు జీవన్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page