Saturday, September 19, 2026
No menu items!
HomeGREATER HYDERABADనేడు మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ – 2026 బ్యాడ్మింటన్ పోటీలు

నేడు మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ – 2026 బ్యాడ్మింటన్ పోటీలు

📰 Generate e-Paper Clip

నేడు మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ – 2026 బ్యాడ్మింటన్ పోటీలు

హైదరాబాద్, మార్చి 20, అద్దం న్యూస్ :   భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్‌లో భాగంగా అక్షర స్ఫూర్తి ఫౌండేషన్ సౌజన్యంతో గాంధీన‌గ‌ర్ డివిజ‌న్ ఘంట‌సాల శ్రీనివాస జిహెచ్ఎంసి గ్రౌండ్స్‌లో నేడు బ్యాడ్మింటన్ పోటీలను జ‌రుగ‌నున్నాయ‌ని బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ ఎ.వినయ్ కుమార్ తెలిపారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఆయ‌న పోటీల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా విన‌య్ మాట్లాడుతూ… ఓబీసీ మొర్చ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్ట‌ర్‌.కె.లక్ష్మణ్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2026 పోటీలను జ‌రుగ‌నున్నాయ‌న్నారు.

     ఈ పోటీల్లో అండర్ 15 బాల బాలికలు, అండర్ 40 పురుషులు, 40 ఏళ్ల పై బడిన పురుషులకు టీమ్‌ల‌ వారీగా బ్యాడ్మింటన్ పోటీలను జరగనున్నాయని విన‌య్ తెలిపారు. పోటీల్లో ఫైనల్స్‌లో గెలుపొందిన విజేతలకు రాజ్యసభ స‌భ్యుడు డాక్ట‌ర్.కె.లక్ష్మణ్ చేతుల మీదుగా బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలను అందజేస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు పోటీల్లో పాల్గొనేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అధ్యక్ష, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు న‌వీన్, ఆనంద్‌రావు, సీనియర్ నాయకులు శ్రీకాంత్, ఎం.ఉమేష్, సాయి కుమార్, జ్ఞానేశ్వర్, నీరజ్, ప్రశాంత్, శ‌శికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page