...

బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ

 బహుజన బతుకమ్మ పాట ఆవిష్కరణ

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 14, అద్దం న్యూస్ :     ప్రకృతి రక్షణే–ప్రజల రక్షణంటూ అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ( ACF ) రూపొందించిన బహుజన బతకమ్మ–2025 పాట ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం హైద‌రాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో విజయవంతంగా జరిగింది. అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల ఆహ్వానం పలకగా, విమలక్క అధ్యక్షత వహించగా, విశ్రాంతి హైదరాబాద్ హైకోర్టు జస్టిస్ రాధా రాణి ముఖ్యఅతిథిగా, విశ్రాంత ఆచార్యులు జయదేవ్ తిరుమలరావు, బహుజన బతుకమ్మ గురించి విశ్రాంత ఆచార్యులు కె.లక్ష్మీ హాజ‌ర‌య్యారు. పాట ఆవిష్కరణ ముందు అమరులకు జోహార్లు తెలుపుతూ సభ మౌనం పాటించింది. రాజేంద్రప్రసాద్ జీవిత సహచరి యాలవర్తి ధనలక్ష్మి పాటను ఆవిష్కరించారు. బహుజన బతుకమ్మ ఏర్పాటును, దాని ఉద్యమ కార్యచరణను 15 సంవత్సరాలుగా ఎత్తి పడుతున్న ఉద్యమ నినాదాలను గురించి బహుజన బతుకమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ లక్ష్మి వివరించారు.                         

విమ‌ల‌క్క మాట్లాడుతూ…నేడు ప్రకృతి విధ్వంసాలు ఎక్కడ జరిగిన వాటికి కారణం మానవ తప్పిదాలే అని అన్నారు. పంట భూముల్ని వెంచర్లుగా మార్చటం, ప్లాస్టిక్ పూలను పెంచి పోషించుట, లక్షలాది వినాయక విగ్రహాల నిమజ్జనం సరి కాదన్నారు. దీని వల్ల పర్యావరణం దెబ్బతింటుంద‌న్నారు. ప్రకృతికి ప్రజలు ఆవాసం లేకున్నా ప్రజలకు ప్రకృతి ఆవాసం ఉంది దానిని కాపాడుకున్నారన్నారు. ప్రొఫెసర్ జయదేవ్ తిరుమల్ రావు మాట్లాడుతూ… పాలకవర్గాలో హైజాక్ చేసిన బతుకమ్మ విశ్రాంతిలో ఉంటే ప్రజల బతుకమ్మ జనం కోసం శ్రమిస్తూనే ఉందన్నారు. అదిలాబాద్ జిల్లా తాంసి గ్రామంలో కేవలం ఐదుగురు మహిళలు కమిటీగా ఏర్పడి వాడ వాడ దళితులను బతుకమ్మ కార్యక్రమంలో కలుపుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మరికొందరు ప్రముఖులు మాదాల రవి, అంబటి నాగన్న, జ‌ర్న‌లిస్ట్‌ రఘు, జ్యోత్స్న, భద్ర, రఫీ, పిడిఎస్‌యు పూర్వ నాయకుడు శీను, సోగరా భేగం, నాగిరెడ్డి, రఘునందన్, మల్లేష్, కస్తూరి శ్రీను, యాదగిరి, సైర్వ భాను, అనంతడుపుల నాగరాజు, దుచ్చర్ల సత్యనారాయణ, భరత్, పృధ్వీరాజ్, పాశం యాదగిరి మాట్లాడారు. విప్లవ కవి రచించిన పాటను విమలక్క అనిత రాకేష్లు ఆలపించగా, అరుణోదయ బృందం కోరస్ అందించగా, పాట-వీడియో రూపకల్పన ప్రేక్షకులను ఆకట్టుకుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.