Friday, September 18, 2026
No menu items!
HomeGREATER HYDERABADఆర్‌వీ ఐస్‌ క్రీమ్, స్వీట్ షాప్ ప్రారంభం

ఆర్‌వీ ఐస్‌ క్రీమ్, స్వీట్ షాప్ ప్రారంభం

📰 Generate e-Paper Clip

ఆర్‌వీ ఐస్‌ క్రీమ్, స్వీట్ షాప్ ప్రారంభం

బాగ్‌లింగంప‌ల్లి, జూలై 31, ( అద్దం న్యూస్ ) :   వ్యాపార రంగంలో యువత ముందుకు రావడం అభినందనీయం అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని బాగ్‌లింగంప‌ల్లి డివిజ‌న్‌ అంబేద్కర్ కళాశాల ప్రధాన రహదారిపై బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు రూపుల వివేక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్‌వీ ఐస్‌క్రీమ్ అండ్ స్వీట్ షాప్‌ను శుక్రవారం మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్ లు ముఖ్య అతిథులుగా హాజ‌రై ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ మాట్లాడుతూ… ఉపాధి అవకాశాలు పెంచే ఇటువంటి సంస్థలు మరింత అభివృద్ధి చెందాలని అన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. నాణ్యమైన సేవలతో వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించాలని నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయ‌కులు రేషం మ‌ల్లేష్‌, ముఠా జైసింహా, సిరిగిరి శ్యామ్‌, ఎయిర్‌టెల్ రాజు, జ‌య‌దేవ్‌, దామోద‌ర్‌, సాయికృష్ణ‌, చిట్టి, బిజెపి నాయ‌కులు గ‌డ్డం న‌వీన్‌, కిర‌ణ్‌, ఎంఆర్‌పిఎస్ నాయ‌కులు గండి కృష్ణ, రాజ‌శేఖ‌ర్‌, గోపి, కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అంజి యాద‌వ్‌, లోకేష్ యాద‌వ్‌, బంటారం యాద‌గిరి గౌడ్‌తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు, స్నేహితులు, స్థానిక నాయకులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page