...

ఉప ఎన్నిక నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు – రూ.10 లక్షలకు పైగా నగదు స్వాధీనం

ఉప ఎన్నిక నేపథ్యంలో ముమ్మరంగా తనిఖీలు

– రూ.10 లక్షలకు పైగా నగదు స్వాధీనం



హైదరాబాద్, అక్టోబ‌ర్ 15, అద్దం న్యూస్ :   

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఎన్నికల పర్యవేక్షణ ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో త‌నిఖీలు చేప‌ట్టాయి. ఈ తనిఖీల్లో 10 లక్షల రూపాయ‌ల‌కు పైగా అక్రమ నగదును స్వాధీనం చేసుకున్నాయి. అధికారుల వివరాల ప్రకారం, ఫ్లయింగ్‌ స్క్వాడ్ 3 A బృందం అమీర్‌పేట్‌ ఎక్స్‌ రోడ్డులో వాహనాన్ని ఆపి రూ.1.50 లక్షలు స్వాధీనం చేసింది. ఫ్లయింగ్‌ స్క్వాడ్ 10 A బృందం వెంకటగిరి కాలనీ రోడ్‌ నెం.2 వద్ద నిర్వహించిన తనిఖీల్లో రూ.2.30 లక్షలు స్వాధీనం చేసింది. ఇక ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ 6B బృందం మధురానగర్‌లో రూ.6.50 లక్షలు స్వాధీనం చేసింది. స్వాధీనం చేసిన నగదును సంబంధిత పంజాగుట్ట, జూబ్లీహిల్స్‌, మధురానగర్‌ పోలీస్‌స్టేష‌న్ల‌కు అప్పగించారని ఎన్నికల అధికారులు తెలిపారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.