Wednesday, November 4, 2026
No menu items!
HomeGREATER HYDERABADసీఎస్ఐర్-ఐఐసీటిలో ఐ-మీట్-2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

సీఎస్ఐర్-ఐఐసీటిలో ఐ-మీట్-2026 అంతర్జాతీయ సదస్సు ప్రారంభం

📰 Generate e-Paper Clip

తార్నాక‌, న‌వంబ‌ర్ 4, ( అద్దం న్యూస్ ) :    శక్తి, పర్యావరణ సవాళ్లకు స్వదేశీ పరిజ్ఞానంతో అధునాతన పరిష్కారాలు కనుగొనడమే లక్ష్యంగా సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ( ఐఐసీటి ) లో ‘ శక్తి, పర్యావరణ సాంకేతికతల కోసం ఇన్నోవేటీవ్ ఫంక్షనల్ మెటీరియల్స్ (ఐ-మీట్-2016 ) మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు బుధవారం ఘనంగా ప్రారంభమైంది. ఈ నెల 6 వరకు కొనసాగే ఈ సదస్సులో రష్యా, జపాన్, ఇజ్రాయెల్తో పాటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 400 మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ప్రతినిధులు, విద్యార్థులు హాజరైనారు. ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి స్వాగతోపన్యాసం చేస్తూ స్వఛ్చమైన శక్తి, ఎలక్ట్రిక్ మొబిలిటి, పర్యావరణ పరిరక్షణ అధునాతన తయారీ వంటి కీలక రంగాలకు ఈ ఐ-మీట్ సదస్సు ఎంతో ప్రాముఖ్యమైందన్నారు. వివిధ శాస్త్రీయ రంగాల నిపుణులు ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడి లక్ష్యాల కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.  ముఖ్య అతిథి డైరెక్టర్ జనర‌ల్ నాలెడ్జ్‌ సిస్టమ్ ఆండ్ మెటీరియల్స్ డీఆర్‌డిఓ డాక్టర్ ఆర్.బాలమురళి కృష్ణన్, గౌరవ అతిథులు డాక్టర్ ఎస్‌విఎస్‌.నారాయణమూర్తి, ప్రొఫెసర్ టి.నరసింగరావు, పద్మశ్రీ డాక్టర్ సుభా వి.అయ్యంగార్ తదితరులు ఈ సదస్సులో కీలక ప్రసంగాలు చేశారు.

భారతదేశ శక్తి, పర్యావరణ భద్రతను బలోపేతం చేయడానికి స్వదేశీ సాంకేతికతలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనకు ఈ సదస్సు దోహదపడుతుందన్నారు. ప్రస్తుతం ఎదురవుతున్న శక్తి, పర్యావరణ సవాళ్లను ఎదుర్కోవడంలో సుస్థిర సాంకేతికతలు, తదుపరి తరం శక్తి నిల్వ వ్యవస్థల అభివృద్ధిలో ఇన్నోవేటీవ్ ఫంక్షనల్ మెటీరియల్ ఆవిష్కరించారు. మెటీరియల్ సైన్స్, నానో టెక్నాలజీ పర్యావరణ పునరుద్ధరణ, ఎలక్ట్రో కెమికల్ పరికరాలలో వస్తున్న ప్రాథమిక పరిశోధనలను ఆచరణాత్మక సాంకేతిక పరిష్కారాలుగా మార్చడంపై ఈ మూడు రోజుల పాటు జరిగే అంతర్జాతీయ సదస్సులో చర్చిస్తామని సదస్సు నిర్వాహకులు తెలియజేశారు. అంతర్జాతీయ విద్యా సహకారం, పరిశ్రమ-అకాడెమియా పరస్పర చర్యలు నాలెడ్జ్ ఎక్స్ఛేంజ్‌కు ఈ వేదిక దోహదపడుతుందన్నారు. ఈ మూడు రోజుల సదస్సులో ఈ సదస్సులో కీనోట్ ప్రసంగాలు, ఇన్వైటెడ్ లెక్చర్స్ ఫ్లాష్ టాక్స్, యంగ్ సైంటిస్టు ప్రెజెంటేషన్లు, పోస్టర్ ప్రదర్శనలు వంటి సెషన్స్ ఉంటాయని సదస్సు ఛైర్మెన్ డాక్టర్ గిరిబాబు, సదస్సు కన్వీనర్ డాక్టర్ వసుంధర ముత్తా, కో-కన్వీనర్ డాక్టర్ సూర్యప్రకాష్ సింగ్ తదితరులు తెలియజేశారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page