Wednesday, November 4, 2026
No menu items!
HomeGREATER HYDERABADతెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం

తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య అత్యంత బాధాకరం

📰 Generate e-Paper Clip

ఉద్యమకారుల త్యాగాలను గత ప్రభుత్వం విస్మరించింది
తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపునకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంది
– మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్

జనగామ, న‌వంబ‌ర్ 3, ( అద్దం న్యూస్ ) :      జనగామ జిల్లా బచ్చన్నపేటకు చెందిన తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, ఉద్యమకాలం నుంచి ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని కలిగించిందని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సభ్యులు మోతె శోభన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.రాములు నాయక్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. బాధిత కుటుంబ సభ్యులకు హృదయపూర్వక సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడిన ఉద్యమకారుల త్యాగాలకు తగిన గుర్తింపు, గౌరవం లభించకపోవడం అత్యంత విచారకరమన్నారు. గత పదేళ్ల పాలనలో ఉద్యమకారుల సంక్షేమాన్ని, వారి సమస్యలను పాలకులు పూర్తిస్థాయిలో పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదరణ, ఆర్థిక భరోసా లేక అనేకమంది ఉద్యమకారులు అప్పులపాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత ప్రజా ప్రభుత్వం ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తోందని వారు తెలిపారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఉద్యమకారుల పట్ల తన బాధ్యతను నెరవేర్చేందుకు కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఆధ్వర్యంలో నిజమైన ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేసి, త్వరితగతిన పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని వెల్లడించారు. అర్హులైన ప్రతి ఉద్యమకారుడికి ప్రభుత్వపరంగా తగిన గుర్తింపు, గౌరవం, న్యాయం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. స్వరాష్ట్ర సాధన కోసం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని పోరాడిన తెలంగాణ ఉద్యమకారులు ఎవరూ అధైర్యపడవద్దని వారు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు ఆవేదనకు లోనై ఆత్మహత్య వంటి ఆతురతతో కూడిన నిర్ణయాలు తీసుకోవద్దని, తమ కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకోవాలని హృదయపూర్వకంగా కోరారు. ఉద్యమకారుల సంక్షేమం, గౌరవం, గుర్తింపు కోసం ప్రభుత్వం, కమిటీ అండగా నిలుస్తాయని భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారుల త్యాగాలకు తగిన ఫలితం దక్కేలా కృషి చేస్తామని, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page