అప్స లాంటి స్వచ్ఛంద‌ సంస్థల ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థులకు స‌హాయం అంద‌చేయ‌డం అభినంద‌నీయం – చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్

అప్స లాంటి స్వచ్ఛంద‌ సంస్థల ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థులకు స‌హాయం అంద‌చేయ‌డం అభినంద‌నీయం

– చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్

హైదరాబాద్, అక్టోబ‌ర్ 16, అద్దం న్యూస్ :      అప్స లాంటి స్వచ్ఛంద‌ సంస్థల ఆధ్వ‌ర్యంలో పేద విద్యార్థులకు స‌హాయం అంద‌చేయ‌డం అభినంద‌నీయమ‌ని చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్ అన్నారు. అప్స స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వెలుగు పతి ల‌లితా శ్రీ, మహేంద్ర కుమార్ దంపతుల సహకారంతో చిక్కడపల్లి లోని ప్రభుత్వ ఆంధ్ర విద్యాలయ పాఠశాలలో విద్యార్థులకు భోజనం ప్లేట్ల‌ పంపిణీ కార్య‌క్ర‌మం గురువారం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా చిక్క‌డ‌ప‌ల్లి పోలీస్‌స్టేష‌న్ ఇన్‌స్పెక్ట‌ర్ రాజు నాయ‌క్ హాజ‌రై మాట్లాడుతూ… ప్రతి ఒక్కరు విద్యతో పాటు సేవ గుణాన్ని కలిగి ఉండాలని, స్వ‌చ్ఛంద సంస్థలు చేస్తున్న సేవలు అభినంద‌నీయ‌మ‌న్నారు. మంచిగా చదువుకొని ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని.. చదువు చెప్పిన గురువులను కన్న తల్లి దండ్రులను గౌరవించాల‌ని, ముందు తరాలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. దాతలు వాళ్ళు ల‌లిత శ్రీ మాట్లాడుతూ…. మా నాన్న ఎం.నాగేశ్వరరావు జయంతి సందర్భంగా పేద విద్యార్థులకు నా వంతు పిల్లలకు సహాయం చేయడం సంతోషకరంగా ఉంద‌న్నారు. ప్రతి ఏడాది ఏదో విధంగా నా వంతు సహాయం అందిస్తానని అన్నారు.

బొట్టు రమేష్ చేస్తున్న సేవాకార్యక్రమాలు అభినందనీయం అన్నారు. అప్స స్వచ్ఛంద‌ సంస్థ సీనియర్ కో–ఆర్డినేటర్ బొట్టు రమేష్ మాట్లాడుతూ… మా సంస్థ అప్స వివిధ దాతల సహకారంతో విద్యార్థులకు సహాయం అందించడమే కాకుండా వారికి వివిధ అంశాల పై అవగాహన కల్పిస్తున్నారన్నారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సదాశివుడు మాట్లాడుతూ… అప్స స్వచ్ఛంద‌ సంస్థ ప్రతి ఏడాది విద్యార్థులకు ఏదో విధంగా సహాయం చేయడం అభినందనీయమ‌న్నారు.


 

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page