...

40 ఏళ్ల క్రితం తాను రాసిన పుస్త‌కాన్ని నేటికి ఆద‌రించ‌డం తృప్తినిస్తోంది – ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్

40 ఏళ్ల క్రితం తాను రాసిన పుస్త‌కాన్ని నేటికి ఆద‌రించ‌డం తృప్తినిస్తోంది
– ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్

హైదరాబాద్, డిసెంబ‌ర్ 20, అద్దం న్యూస్ :   సుమారు 40 ఏళ్ల క్రితం తాను రాసిన పుస్తకాన్ని పాఠకులు నేటికీ ఆదరించడం ఒక రచయిత్రిగా తనకు ఎంతో తృప్తినిచ్చిందని ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్ అన్నారు. 38 హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో భాగంగా శనివారం సాయంత్రం ఎన్‌టిఆర్ స్టేడియంలో పుస్తక స్పూర్తి..పుస్తకం ఒక దారి దీపం అనే పేరుతో కార్యక్రమం జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి వ‌సంత క‌న్నాబిరాన్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘కఠోర షడ్జమాలు’.. విమర్శకు సమాధానం పుస్తకానికి ఆ పేరు రావడం వెనుక ఉన్న ఆసక్తికరమైన ఉదంతాన్ని ఆమె వివరించారు. ఒక విమర్శకుడు తనను ఉద్దేశించి “వసంత కోకిల పలికే కఠోర షడ్జమాలు” అని ఎగతాళి చేస్తే, ఆ విమర్శనే ఒక సవాలుగా తీసుకుని తన పుస్తకానికి శీర్షికగా పెట్టానని తెలిపారు. “మంచి పని చేసేటప్పుడు విమర్శలు ఎదురైతే వాటిని తిప్పికొట్టే కోపం మనకు ఉండాలి.. అదే నన్ను ఇన్నాళ్లూ ముందుకు నడిపించిందని ఆమె స్పష్టం చేశారు. గతంలో సమాజంలో ఉన్న భిన్నత్వం, వైవిధ్యం నేడు తగ్గిపోతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన చిన్నతనంలో అన్ని మతాల వారు కలిసుండే వాతావరణం ఉండేదని, ప్రస్తుతం ఆ వైవిధ్యం లోపిస్తోందని అన్నారు. తాను పెరిగిన ప్రాంతంలోని పాత జ్ఞాపకాలతో ప్రస్తుతం ఒక నవలను రాస్తున్నట్లు వసంత కన్నబిరాన్ వెల్లడించారు. మనం చేసే పనిపై నమ్మకం ఉన్నప్పుడు, విమర్శలను ఎదుర్కొనే ధైర్యం, శక్తి ఉండాలని ప్రముఖ రచయిత్రి వసంత కన్నబిరాన్ పిలుపునిచ్చారు.

          ప్రముఖ దర్శకుడు బి.నర్సింగ్ రావు మాట్లాడుతూ… పుస్తక పఠనం ఒక పండుగ అని అన్నారు. తన జీవితంలో పుస్తకం ఒక అంతర్భాగమని, ఒకప్పుడు రోజుకు 13 గంటల పాటు నిరంతరాయంగా చదివిన రోజులే తన జీవితంలో ‘గోల్డెన్ పీరియడ్’ అని ఆయన స్మరించుకున్నారు. ప్రస్తుతం తన వ్యక్తిగత లైబ్రరీలో 50,000 పైగా పుస్తకాలు ఉన్నాయని, నిత్యం కొత్త పుస్తకాలు వస్తూనే ఉంటాయని తెలిపారు. ప్రపంచమంతా తిరిగినా, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పుస్తకాన్ని ఎప్పుడూ వీడలేదని, ముఖ్యంగా కవిత్వం అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. తన సంపాదనలో ఎక్కువ భాగం పుస్తకాలకే ఖర్చు చేస్తానని, కనీసం బట్టలు కూడా పిల్లలే కొంటారని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎడిటర్ రాంపల్లి రమేశ్, బుక్ ఫెయిర్ అధ్యక్షుడు కవి యాకూబ్, ఉపాధ్యక్షుడు బాల్ రెడ్డి త‌దిత‌రులున్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page

Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.