Friday, September 18, 2026
HomeNewsJr NTR: హైకోర్టు మెట్లెక్కిన యంగ్ టైగర్

Jr NTR: హైకోర్టు మెట్లెక్కిన యంగ్ టైగర్

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన వ్యక్తిత్వ హక్కుల ఉల్లంఘనపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా సోషల్ మీడియా, ఈ–కామర్స్ వేదికల్లో వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్నారంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, 2021 ఐటీ నిబంధనల ప్రకారం తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత ప్లాట్‌ఫామ్స్‌ను ఆదేశించింది. అన్నింటిపై మూడు రోజుల్లోగా స్పందించాలని కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను డిసెంబర్ 22కు వాయిదా వేసింది.

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తన వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు సినీ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. సోషల్ మీడియా, ఈ–కామర్స్ వేదికల ద్వారా తన పేరు, ఫొటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రయోజనాల కోసం వాడుతూ వ్యక్తిత్వ హక్కులను ఉల్లంఘిస్తున్నారని ఎన్టీఆర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన పేరు, ప్రతిష్ట, ఇమేజ్‌ను దుర్వినియోగం చేయడం వల్ల తనకు నష్టం కలుగుతోందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదే తరహాలో గతంలో పలువురు సినీ ప్రముఖులు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నుంచి అజయ్ దేవగన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ వంటి నటులు తమ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానాలను ఆశ్రయించారు. అలాగే దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున కూడా ఇలాంటి కేసుల్లో కోర్టు ఆదేశాలు పొందారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడవడం టాలీవుడ్‌లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘డ్రాగన్’లో నటిస్తున్నారు. ఇందులో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png
RELATED ARTICLES

Most Popular

You cannot copy content of this page