Sunday, November 1, 2026
No menu items!
HomeHyderabadకరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో రాణించిన కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు

కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో రాణించిన కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు

📰 Generate e-Paper Clip

కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో రాణించిన కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు

హైదరాబాద్, సెప్టెంబ‌ర్ 21, అద్దం న్యూస్ :      కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో కామాక్షిపురం ప్లే గ్రౌండ్ విద్యార్థులు రాణించారు. జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆదివారం ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ల్యాండ్‌స్కేప్ గార్డెన్‌లో కరాటే బెల్ట్ పరీక్ష జ‌రిగింది. సెన్సే రాపోలు సుదర్శన్, మాస్టర్ బి.విశ్వనాధం, కోచ్ నవీన్ నాయక్ మార్గదర్శకత్వంలో కామాక్షిపురం ప్లే గ్రౌండ్‌లోని విద్యార్థులు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో విజయవంతంగా ఉత్తీర్ణులయ్యారన్నారు. ఇందులో భాగంగా శ్రీకాంత్, ఇంటర్నేషనల్ బ్లాక్ బెల్ట్ 2 వ డాన్ గెలిచాడు. ఉదయ్, రక్షిత్ లకు బ్రౌన్ బెల్ట్‌లో డిప్లొమాలు లభించాయి. కోచ్ నవీన్ నాయక్ మాట్లాడుతూ… విద్యార్థుల‌కు తల్లిదండ్రుల నిరంతర మద్దతును ఇస్తున్నందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.                                                              నేటి ప్రపంచంలో కరాటే ప్రాముఖ్యత చాలా ఉంద‌న్నారు. ఈ విలువైన కళారూపాన్ని ప్ర‌తి ఒక్క‌రూ నేర్చుకోవాలని అన్నారు. కరాటే ఆత్మరక్షణను నేర్పించడమే కాకుండా క్రమశిక్షణ, నైతిక విలువలు, ఫిట్‌నెస్, శ్రేయస్సును కూడా పెంపొందిస్తుందన్నారు. గత 12 సంవత్సరాలుగా కామాక్షిపురం ప్లే గ్రౌండ్‌లో అన్ని వయసుల వ్యక్తులకు ఉచిత కరాటే శిక్షణను అందిస్తున్నామ‌న్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల‌న్నారు.


 

- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular

You cannot copy content of this page