అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) మరో ప్రతిష్టాత్మక రికార్డుకు చేరువలో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్‌లో 28,000 పరుగుల మైలురాయిని అధిగమించేందుకు కోహ్లీకి కేవలం 25 పరుగులు మాత్రమే అవసరం. జనవరి 11న న్యూజిలాండ్‌తో ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో ఈ ఘనత సాధించే అవకాశం ఉంది.
ప్రస్తుతం 623 ఇన్నింగ్స్‌లలో 27,975 పరుగులు సాధించిన కోహ్లీ (Virat Kohli).. ఈ మైలురాయిని దాటితే అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో 28 వేల పరుగులు చేసిన మూడవ బ్యాటర్‌గా నిలుస్తారు. ఇప్పటివరకు ఈ ఘనతను భారత దిగ్గజం సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు), శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (28,016 పరుగులు) మాత్రమే సాధించారు. సచిన్ కంటే వేగంగా తక్కువ ఇన్నింగ్స్‌లలోనే ఈ మార్కును చేరుకునే అవకాశం కోహ్లీకి ఉంది.
టెస్టులు, టీ20లకు వీడ్కోలు పలికిన తర్వాత కోహ్లీ పూర్తిగా వన్డేలపైనే దృష్టి పెట్టారు. న్యూజిలాండ్‌తో జరిగే తొలి వన్డేలోనే ఆయన (Virat Kohli) ఈ రికార్డును బద్దలు కొట్టి, క్రికెట్ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖిస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. వన్డేల్లో ఇప్పటికే 53 సెంచరీలు సాధించిన కోహ్లీ, ఈ సిరీస్‌లో మరిన్ని రికార్డులు బద్దలు కొడతాడని ఫాన్స్ నమ్ముతున్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png















Leave a Reply