Home Political బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉపాధ్య‌క్షుడిగా ల‌వ కుమార్ చామ‌ల నియామ‌కం

బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉపాధ్య‌క్షుడిగా ల‌వ కుమార్ చామ‌ల నియామ‌కం

0
1

బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉపాధ్య‌క్షుడిగా ల‌వ కుమార్ చామ‌ల నియామ‌కం

హైదరాబాద్, డిసెంబ‌ర్ 27, అద్దం న్యూస్ :    బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉపాధ్య‌క్షుడిగా ముషీరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ల‌వ కుమార్ చామ‌ల నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్య‌క్షుడు ఆర్.క్రిష్ణ‌య్య ల‌వ కుమార్‌కు నియామ‌క‌ప‌త్రాన్ని అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా ల‌వ కుమార్ మాట్లాడుతూ.. త‌న పై న‌మ్మ‌కంతో బిసి సంక్షేమ సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఉపాధ్య‌క్షుడిగా నియ‌మించినందుకుగాను ఆర్‌.క్రిష్ణ‌య్య‌కు, బిసి యువజ‌న సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడు గ‌వ్వ‌ల భ‌ర‌త్‌కుమార్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌చేశారు. బిసిల హ‌క్కుల కోసం ఆర్.క్రిష్ణ‌య్య చేసే ప్ర‌తి ఉద్య‌మంలో త‌న వంతు పాత్ర పోషిస్తాన‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బిసి నాయ‌కులు రాజ్‌కుమార్, ప్రీతమ్‌, నీల వెంక‌టేష్, రాజేంద‌ర్‌, బిసి యువ‌జ‌న సంఘం గ్రేట‌ర్ హైద‌రాబాధ్ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ మార్క ర‌మేష్ కుమార్ యాద‌వ్‌, మ‌హే్‌ష‌, సురేంద్ర‌, రాఘ‌వేంద్ర‌, ప్ర‌తాప్‌, సురేష్‌, ల‌క్ష్మ‌ణ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

You cannot copy content of this page