పోలింగ్‌కు ముందే 68 సీట్లు..

అద్దం న్యూస్, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర పురపోరులో.. అధికార ప్రభుత్వం విజయకేతనం ఎగురవేసింది. పోలింగ్‌కు ముందే భాజపా నేతృత్వంలోని మహాయుతి కూటమి పలు స్థానాల్లో విజయం సాధించింది. ఎన్నికలు లేకుండానే 68 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల (Maharashtra civic polls)కు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది.

ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలిగారు. దీంతో పలు స్థానాల్లో పోటీ లేకుండానే విజయం లభించింది. ఇందులో భాజపా 44, ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీకి 22, అజిత్‌ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ రెండు స్థానాలు గెలుచుకున్నాయి.

ఈ ఏకగ్రీవ విజయాలపై అధికార ప్రభుత్వం ఆనందం వ్యక్తంచేసింది. ఈ విజయాలపై శివసేన పార్టీ (ఉద్ధవ్‌ ఠాక్రే) స్పందిస్తూ.. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ వంటి కేంద్ర సంస్థలను అడ్డుగా పెట్టుకొని ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, లంచం ఇవ్వడంతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని ఆరోపించింది. ఇక, బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ (BMC)తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.

https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gravatar profile

You cannot copy content of this page