హైదరాబాద్, అద్దం న్యూస్ : ఈ నెల 27న హనుమకొండ ఎల్కతుర్తిలో జరుగనున్న బిఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బిఆర్ఎస్ పార్టీ ముషీరాబాద్ డివిజన్ అధ్యక్షుడు కొండా శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం బిఆర్ఎస్ రజతోత్సవ సభ సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై మాట్లాడారు. కేసీఆర్ ఎగరేసిన ఈ గులాబీ జెండా కోట్ల గొంతులను ఏకం చేసిందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు ముఠా జైసింహా, శ్రీనివాస్ గుప్త, శోభ, బిక్షపతి యాదవ్, మహబూబ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
https://addamnews.com/wp-content/uploads/2026/06/Untitled-2-copy-2.png













Leave a Reply